MDK: మనోహరాబాద్ మండలంలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 11 మందికి రూ.1.10 లక్షల భారీ జరిమానా విధించినట్లు ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. నిందితులను జేఎఫ్సీఎం కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారని వివరించారు. ప్రాణాలు ముప్పులో పడేసేలా ఎవరూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు.
వార్తలు
డ్రంకెన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 11 మందికి జరిమానా


