TG: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. లింబాద్రి గుట్ట వడ్డెర కాలనీలోని ఓ నీటికుంటలో ప్రమాదవశాత్తూ ముగ్గురు చిన్నారులు పడి మృతి చెందారు. మృతులను హరీష్ (11), వర్షిణి (6), అరవింద్ (5)గా గుర్తించారు. ఈ ఘటనతో వడ్డెర కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
క్రైమ్
ఘోర విషాదం.. ముగ్గురు చిన్నారులు మృతి


