TG: కామారెడ్డి జిల్లా పిట్లం మండలం బొల్లక్ పల్లి వద్ద మంజీరా నదిలో ఈతకు వెళ్లిన నలుగురు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు.. గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టి ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. మృతులంతా కిష్టాపూర్‌కు చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.
క్రైమ్
మంజీరా నదిలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి


