హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

పసిపిల్లలకు ఎక్కిళ్లు వస్తున్నాయా? 

చిన్నారుల్లో ఏడాది వయసు వచ్చే వరకు ఎక్కిళ్లు రావడం సర్వసాధారణమని వైద్యులు చెబుతున్నారు. పాలు తాగేటప్పుడు పొట్టలోకి గాలి వెళ్లడం వల్లే ఇలా జరుగుతుంది. దీని నివారణకు పాలు తాగించే మధ్యలో చిన్నారిని నిటారుగా ఉంచి వెన్ను నిమురుతూ తేన్పు వచ్చేలా చేయాలి. సాధారణంగా శిశువులలో ఎక్కిళ్లు సహజమైనవి. అవి వారి శరీరానికి ఎటువంటి హాని చేయవు, కొద్దిసేపట్లో వాటికవే తగ్గిపోతాయి.