హైదరాబాద్: 28°C
వ్యాపారం

దేశ జీడీపీ వృద్ధి రేటు 7.7శాతం: కేంద్రం

2025-26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడీపీ వృద్ధి రేటు 7.7 శాతంగా నమోదైందని కేంద్రం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలోని 7.1 శాతంతో పోలిస్తే ఇది మరింత మెరుగైన వృద్ధిని సూచిస్తున్నట్లు తెలిపింది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, యుద్ధ భయాలు ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని వెల్లడించింది.