ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ విజేతగా శ్రీలంక ‘ఏ’ జట్టు నిలిచింది. దోహాలో జరిగిన ఉత్కంఠ ఫైనల్లో పాకిస్తాన్ ‘ఏ’ జట్టుపై ఒక్క వికెట్ తేడాతో గెలిచి మూడోసారి టైటిల్ కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 216/9 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో నిశాన్ మధుశంక (87) మెరవడంతో లంక 41.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి గెలిచింది. 8 ఏళ్ల తర్వాత శ్రీలంక ఈ ట్రోఫీని ముద్దాడింది.
క్రీడలు
ఫైనల్లో పాక్‌ను చిత్తు చేసిన శ్రీలంక


