హైదరాబాద్: 28°C
క్రీడలు

చెత్త రికార్డు మూటగట్టుకున్న మిచెల్ మార్ష్

ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ విధ్వంసకర సెంచరీ (57 బంతుల్లో 119) సాధించినా ఆసీస్‌కు ఓటమి తప్పలేదు. ఇరు జట్ల మధ్య సెంచరీ చేసి కూడా ఓడిన మ్యాచ్‌లో భాగమైన తొలి ఆసీస్ ఆటగాడిగా మార్ష్ నిలిచాడు. గతంలో ఆరోన్ ఫించ్ (2013), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (2018) సెంచరీలు చేసిన మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియానే విజయం సాధించింది.