హైదరాబాద్: 28°C
వార్తలు

TDP మద్దతు అభ్యర్థులకు మద్దతుగా MLA అదితి

VZM: పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని MLA అదితి విజయలక్ష్మి గజపతిరాజు కోరారు. ఆదివారం విజయనగరం మండలం రీమాపేట, ముడిదాం గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు చిల్ల వెంకటలక్ష్మి, మజ్జి శివకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని ఆమె పేర్కొన్నారు.