హైదరాబాద్: 28°C
వార్తలు

పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఎమ్మెల్యే గంటా

AKP: భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ ఏడాది డిసెంబర్ 1న తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండనున్నారు. డిసెంబర్ 2న పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కార్యకర్తలు, నాయకులు తనను కలిసేందుకు రావద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి శ్రేణులంతా కృషి చేయాలని ఆయన సూచించారు.