KNR: అంబేడ్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రజా మిత్ర ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారపు నివాళుల కార్యక్రమం ఆదివారం కొనసాగింది. కోర్టు చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి దళిత సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ పరిరక్షణ, అంబేడ్కర్ సిద్ధాంతాల ప్రచారం, రాజ్యాంగంపై జరుగుతున్న దాడులపై అవగాహన కల్పిస్తామన్నారు.
వార్తలు
కరీంనగర్లో అంబేద్కర్‌కు వారపు నివాళుల కార్యక్రమం


