ఉదయం టిఫిన్ మానేయడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి అందక నీరసంగా ఉంటారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అసమతుల్యం చేసి మధుమేహానికి దారితీస్తుంది. మెదడు పనితీరు మందగించి ఏకాగ్రత కుదరదు. మధ్యాహ్నం అతిగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. అందుకే ఉదయాన్నే పోషకాలు ఉన్న అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి.
ఆరోగ్యం
ఉదయం టిఫిన్ మానేస్తున్నారా..?


