హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

చ‌లికాలంలో బీపీ పెరుగుతుందా..?

చలికాలంలో బీపీ పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలికి రక్తనాళాలు సంకోచించడం వల్ల రక్తపోటు ఎక్కువవుతుంది. ముఖ్యంగా హైపర్‌టెన్షన్ ఉన్నవారు, వృద్ధులు జాగ్రత్త వహించాలి. వెచ్చని దుస్తులు ధరించడం, క్రమం తప్పకుండా బీపీ పరీక్షించుకోవడం వంటివి చేయాలి. తగినంత నీరు తాగడం, ఉప్పు తగ్గించడం, తేలికపాటి వ్యాయామం చేయడం ద్వారా చలికాలంలో బీపీని నియంత్రణలో ఉంచుకోవచ్చు.