ములుగు మండలం జగ్గన్నపేటలో రూ.50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయతీ భవనానికి ఆదివారం మంత్రి సీతక్క భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రామ పంచాయతీలు స్థానిక ప్రజాస్వామ్యానికి పునాదులన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు చేరువ చేయడంలో కీలకమని అన్నారు. నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
పంచాయతీ నిర్మాణానికి మంత్రి భూమి పూజ


