హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

కెఫీన్ కటాఫ్ టైమ్ ఎందుకు ముఖ్యం?

మధ్యాహ్నపు మత్తు వదలించుకోవడానికి చాలామంది 2:30 లేదా 3 గంటల తర్వాత స్ట్రాంగ్ కాఫీ తాగుతుంటారు. కానీ కాఫీలోని కెఫీన్ ప్రభావం శరీరం నుంచి పోవడానికే 5 నుంచి 7 గంటలు పడుతుంది. అంటే మధ్యాహ్నం తాగే కాఫీ రాత్రి 10 గంటలైనా మెదడును మేల్కొని ఉండేలా చేసి గాఢ నిద్రను దెబ్బతీస్తుంది. మధ్యాహ్నం 2 గంటల లోపే చివరి కప్పు కాఫీ ముగించి, ఆ తర్వాత నీళ్లు లేదా హెర్బల్ టీ తీసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.