హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మున్సిపల్ ఛైర్మన్

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని పిరంగడ్డ వద్ద ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి, పీఏసీఎస్ ఛైర్మన్ అబ్బిడి రాజిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు దళారులకు ధాన్యం విక్రయించి నష్టపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.