MLG: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను స్మరిస్తూ ఆదివారం ములుగు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్షా దివస్ నిర్వహించారు. BRS జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులర్పించారు. 2009 నవంబర్ 29న చేపట్టిన దీక్ష తెలంగాణ ఉద్యమంలో చారిత్రక మలుపుగా నిలిచిందని నాయకులు పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: ములుగులో దీక్షా దివస్ నిర్వహణ


