హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రెస్టారెంట్లలో భోజనం చేస్తున్నారా..?

బయటి ఆహారం రుచిగా ఉన్నా, తరచూ రెస్టారెంట్లలో తినడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. వీటిలో వాడే కృత్రిమ రంగులు, టేస్టింగ్ సాల్ట్, నాణ్యత లేని నూనెల వల్ల జీర్ణ సమస్యలు, స్థూలకాయం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. శుభ్రత లోపించడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ కూడా జరగొచ్చు. అందుకే సాధ్యమైనంత వరకు ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.