హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఉదయం లేవగానే ముఖం ఉబ్బినట్లు కనిపిస్తోందా?

ఉదయం నిద్రలేవగానే చాలామందిలో ముఖం, కళ్ల కింద కాస్త ఉబ్బినట్లు కనిపిస్తుంది. దీన్ని తగ్గించుకోవడానికి లేవగానే చల్లని నీటితో ముఖం శుభ్రంగా కడుక్కోవడం ఉత్తమం. అలాగే శుభ్రమైన కాటన్ వస్త్రంలో ఐస్ క్యూబ్ చుట్టి ముఖంపై 2 నిమిషాలు సున్నితంగా అద్దడం వల్ల రక్త ప్రసరణ పెరిగి ఉబ్బరం తగ్గుతుంది. చర్మ రంధ్రాలు బిగుతుగా మారి ముఖం తక్షణమే తాజాగా, కాంతివంతంగా కనిపిస్తుంది.