NLG: ఏఎమ్మార్పీ 7బి డిస్ట్రిబ్యూటరీ చివరన ఠానేదార్పల్లి ఊర చెరువుకు, నీరందించే తూముల ఇనుప గేట్లు మాయమయ్యాయి. స్థానికులే తొలగించారా, దొంగలు ఎత్తుకెళ్లారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాల్వలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇనుప సామగ్రి చోరీకి గురవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గేట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
కాల్వ తూము గేట్లు మాయం.. పట్టించుకునే వారేరీ?


