హైదరాబాద్: 28°C
భక్తి

నేడు శ్రీవారి రూ.300 దర్శన టికెట్లు విడుదల

AP: శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి రూ.300 ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఇవాళ ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. డిసెంబర్ 22 నుంచి 29 వరకు దర్శనాలకు ఇవి వర్తిస్తాయి. ఏకాదశి, ద్వాదశి టోకెన్ల కోసం డిసెంబర్ 1 నుంచి 5 వరకు ఈ-డిప్‌లో నమోదు చేసుకోవాలి. ఎంపికైన వారికి డిసెంబర్ 7 మధ్యాహ్నం 3 గంటలకు టోకెన్లు ఇస్తారు. అలాగే, డిసెంబర్ 8 ఉదయం 10 గంటలకు దాతల దర్శన కోటా విడుదలవుతుంది.