హైదరాబాద్: 28°C
వార్తలు

సోనియా గాంధీ బయోపిక్‌కు డైరెక్టర్ ఫిక్స్

TG: సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా తీయనున్న సినిమాకు క్రాంతి మాధవ్‌ను దర్శకుడిగా ఎంపిక చేసినట్లు జగ్గారెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ అనుమతి కోసం డిసెంబర్ 10న ఢిల్లీ వెళ్లి సోనియాను కలుస్తానని చెప్పారు. దేశం కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగాలను ఇందులో చూపిస్తామని పేర్కొన్నారు. సంగారెడ్డికి చెందిన 50 మంది కార్యకర్తలతో కమిటీ వేస్తామని తెలిపారు. వారే నిర్మాతలుగా వ్యవహరిస్తారని జగ్గారెడ్డి వెల్లడించారు.