హైదరాబాద్: 28°C
క్రైమ్

ఓటమిని తట్టుకోలేక కత్తితో దాడి

AP: గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కసుకర్రు కౌంటింగ్ కేంద్రం వద్ద ఘర్షణ జరిగింది. ఇక్కడి సర్పంచ్‌గా వైసీపీ మద్దతుదారు కొచ్చర్ల మేరమ్మ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో తన భార్య అనంతలక్ష్మి ఓడిపోవడంతో బెనర్జీ ఆగ్రహానికి గురయ్యాడు. అనంతలక్ష్మితో పాటు ఆమె కుమారులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తల్లి, కుమారులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.