హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వర్ణగిరిలో ఘనంగా తిరువీధి ఉత్సవం

BHNG: సాయంత్రం 6:30కు స్వర్ణగిరి స్వామివారి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. మాడవీధుల్లో స్వామివారిని ఘనంగా ఊరేగించగా, భక్తుల గోవింద నామస్మరణలు, మేళతాళాలు, మృదంగ మంగళధ్వనులతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. అనంతరం సహస్రదీపాల కాంతుల మధ్య స్వామివారు ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు వేదమంత్రాలతో పూజలు నిర్వహించి కర్పూర మంగళహారతులు సమర్పించారు.