హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాంధారి ఖిల్లా ట్రెక్కింగ్‌కు అనూహ్య స్పందన

MNCL: మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ పంచాయతీ పరిధిలోని చారిత్రాత్మక కట్టడం గాంధారి ఖిల్లాలో ఆదివారం నిర్వహించిన ట్రెక్కింగ్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. మంచిర్యాల సీఐ ప్రమోద్ రావు, జెండా ఊపి ప్రారంభించారు. ఇలాంటి ట్రెక్కింగ్ కార్యక్రమాల ద్వారా గాంధారి ఖిల్లా విశిష్టత, చారిత్రక ప్రాధాన్యత నలుదిశలా వ్యాప్తి చెందుతాయని తెలిపారు.