హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరవాసులకు కొత్త విహార కేంద్రం

RR: హైడ్రా పునరుద్ధరణ పనులతో మాదాపూర్‌లోని తమ్మిడికుంట చెరువు నగరవాసులకు కొత్త విహార కేంద్రంగా మారింది. శిల్పారామం ఎదురుగా ఉన్న ఈ చెరువు చుట్టూ 1.6 కిలోమీటర్ల పాత్‌వే, ఓపెన్ జిమ్, గజీబోలు ఏర్పాటు చేశారు. ఆక్రమణల నుంచి విముక్తి పొంది ఆహ్లాదకరంగా మారిన చెరువును చూసి ఐటీ ఉద్యోగులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రాకు కృతజ్ఞతలు తెలిపారు.