హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహా పడిపూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

NGKL: బిజినేపల్లి మండలం శాయిన్‌పల్లిలో మాజీ ఉపసర్పంచ్ కురుమయ్య ఆధ్వర్యంలో అయ్యప్ప మహా పడిపూజ మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వాహకులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.