VKB: భగవద్గీత కంఠస్థ పోటీల్లో వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన భాష్యం కాలేజీ విద్యార్థిని మోక్ష ప్రతిభ చాటింది. ఎంఫీసీ మొదటి సంవత్సరం చదువుతున్న ఆమె పట్టణ స్థాయిలో ప్రథమ బహుమతి సాధించింది. భగవద్గీత శ్లోకాలను కంఠస్థం చేసి విజయం అందుకున్న మోక్షను కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
భగవద్గీత పోటీల్లో తాండూరు విద్యార్థిని సత్తా


