హైదరాబాద్: 28°C
వార్తలు

బిల్లు మద్దతుపై వెనక్కి తగ్గేది లేదు: DMK

DMK అధినేత ఎంకే స్టాలిన్‌తో ఇండి కూటమి అగ్రనేతల భేటీ ముగిసింది. చెన్నైలోని స్టాలిన్ నివాసంలో ఖర్గే, సోనియా, రాహుల్ తదితరులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. డీలిమిటేషన్‌తో పాటు మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రేపు పార్లమెంట్‌లో కేంద్రానికి మద్దతు ఇస్తామని స్టాలిన్ తేల్చి చెప్పారు. బిల్లుకు మద్దతు ఇచ్చే విషయంలో వెనక్కి తగ్గేది లేదని DMK స్పష్టం చేసింది.