డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌తో ఇండియా కూటమి నేతల భేటీ నేపథ్యంలో డీఎంకే ఎంపీ కనిమొళి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజనపై తమ వైఖరి స్పష్టంగా ఉందని, ఇతర పార్టీల వైఖరి గురించి వారినే అడగాలని అన్నారు. ఈ అంశంపై స్టాలిన్ ఇప్పటికే తమ ఎంపీలతో చర్చించారని, ఆయన తీసుకునేదే పార్టీ తుది నిర్ణయమని పేర్కొన్నారు. కూటమి నేతలతో చర్చలు ముగిశాక నిర్ణయాలను వెల్లడిస్తామని తెలిపారు.
వార్తలు
స్టాలిన్ నిర్ణయమే తుది నిర్ణయం: ఎంపీ కనిమొళి


