AKP: మాకవరపాలెంలో నిర్వహించిన జిల్లా స్థాయి జూనియర్ బేస్బాల్ ఎంపిక పోటీలు ముగిశాయి. ఈ పోటీల్లో 70 మంది బాలురు, 100 మంది బాలికలు పాల్గొన్నారు. ప్రతిభ ఆధారంగా 18 మంది బాలురు, 18 మంది బాలికలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు బేస్బాల్ అసోసియేషన్ చైర్మన్ అక్షయ కృష్ణ తెలిపారు. క్రీడాకారులకు పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రస్థాయి పోటీలకు 36 మంది ఎంపిక


