హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్‌లో వాకర్స్ ఇంటర్నేషనల్ వాక్ థాన్

KNR: వాకర్స్ ఇంటర్నేషనల్ 40 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆదివారం కరీంనగర్‌లో డిస్ట్రిక్ట్ 304 ఆధ్వర్యంలో వాక్‌థాన్ నిర్వహించారు. 2 కిలోమీటర్ల మేర సాగిన ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది పాల్గొన్నారు. ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతపై నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం అతిథులను సత్కరించి, ప్రతిభావంతులకు అవార్డులు అందజేశారు.