హైదరాబాద్: 28°C
క్రీడలు

బుమ్రా అరుదైన రికార్డు

జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు సాధించాడు. విదేశీ గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో బుమ్రా 341 వికెట్లతో జవగల్ శ్రీనాథ్ (340)ను అధిగమించి నాలుగో స్థానానికి చేరాడు. న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో నికోల్స్ వికెట్‌తో అతను ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే (477), జహీర్ ఖాన్ (398), కపిల్ దేవ్ (368) మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు.