SKLM: హైదరాబాద్‌లోని బాచుపల్లిలో ఈ నెల 24న జరిగిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ అపార్ట్‌మెంట్‌లో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు పీల్చి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను పవన్ యల్లా (20), కె. షణ్ముఖరావు (26), సురేష్ (24)గా గుర్తించారు. ఈ ఘటనతో వారి స్వగ్రామాల్లో విషాదం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
సెప్టిక్ ట్యాంక్‌లో ముగ్గురి మృతి


