హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసీఆర్ దీక్షతో ఉద్యమం ఉద్ధృతం: మాజీ MLA

WGL: కేసీఆర్ దీక్షతో తెలంగాణ ఉద్యమం మరింత ఉద్ధృతం అయ్యిందని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ చౌరస్తాలో ఆదివారం దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, హక్కులు, భవిష్యత్తు కోసం సాగిన ఉద్యమ చరిత్రలో దీక్షా దివస్‌కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఉద్యమంలో BRS పార్టీ పాత్ర ఎన్నటికీ మరువలేనిదని గుర్తు చేశారు.