హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోదావరిలో నీటి కొరత..తెప్పోత్సవంపై ఆందోళన

BDK: భద్రాచలంలో గోదావరి నీటిమట్టం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో సీతారాముల తెప్పోత్సవంపై సందిగ్ధత నెలకొంది. డిసెంబర్ 10 నుంచి జనవరి 2 వరకు జరగనున్న ముక్కోటి ఉత్సవాల్లో తెప్పోత్సవ నిర్వహణకు కనీసం ఏడు అడుగుల నీరు అవసరం. ప్రస్తుతం నదిలో తగినంత నీరు లేకపోవడంతో ఉత్సవాల నిర్వహణపై ఆందోళన వ్యక్తమవుతోంది.