హైదరాబాద్: 28°C
తెలంగాణ

టేకుమట్లలో ఫిట్ ఇండియా సైకిల్ ర్యాలీ

BHPL: టేకుమట్ల మండలంలో ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఎస్సై అమూల్య ఆధ్వర్యంలో ఆదివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, యువత రోజువారీ వ్యాయామంతో పాటు సైక్లింగ్‌ను అలవాటు చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎస్సై సూచించారు. శారీరక దృఢత్వానికి ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంతో అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మహేందర్, మనోహర్, దినేష్ పాల్గొన్నారు.