హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభ్యంతరంతో వెనుదిరిగిన వైసీపీ అభ్యర్థి

TPT: తిరుపతి రూరల్ మండలంలో ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఏజెంట్ అనుమతిపై వివాదం చోటుచేసుకుంది. వైసీపీ అభ్యర్థి గోపి 1వ వార్డు అభ్యర్థి చిట్టెమ్మ తరఫున కౌంటింగ్ ఏజెంట్‌గా వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే స్థానిక ఓటరు కాని వ్యక్తికి ఏజెంట్‌గా ఎలా అనుమతిస్తారని మరో అభ్యర్థి భాస్కరరెడ్డి అభ్యంతరం తెలిపారు. దీంతో పోలీసులు గోపిని క్షుణ్ణంగా తనిఖీ చేసి వెనక్కి పంపించారు.