CTR: బంగారుపాళ్యం మండలం కరిడివారిపల్లిలో సర్పంచ్ ఎన్నికల్లో రాఘవరెడ్డి ఘన విజయం సాధించారు. పంచాయతీలో మొత్తం 583 ఓట్లకు గాను 520 ఓట్లు పోలవగా 89.19 శాతం పోలింగ్ నమోదైంది. వైసీపీ బలపరిచిన రాఘవరెడ్డికి 483 ఓట్లు, టీడీపీ బలపరిచిన అభ్యర్థికి 34 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థికి 6 ఓట్లు వచ్చాయి. భారీ ఆధిక్యంతో రాఘవరెడ్డి విజయం సాధించారు.
ఆంధ్రప్రదేశ్
కరిడివారిపల్లిలో వైసీపీ అభ్యర్థి జయకేతనం


