CTR: పుంగనూరు మండలంలోని 23 గ్రామపంచాయతీల్లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 85.21 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 234 పోలింగ్ బూత్‌లలో 43,235 మంది ఓటర్లకు గాను 36,841 మంది ఓటు వేసినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్ ముగియడంతో గ్రామాల్లో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరులో 85.21 శాతం పోలింగ్ నమోదు


