హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసులతో టీడీపీ నేత వాగ్వాదం

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలోని తెలికిపెంటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గోవిందరావు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఎస్‌ఐతో జరిగిన తోపులాటలో గోవిందరావు చేతికి గాయమైంది. పోలీసుల తీరును నిరసిస్తూ మహిళలు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.