హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బచ్చులవారిపాలెంలో ఉద్రిక్తత

BPT: వేటపాలెం(M) బచ్చులవారిపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొత్తరెడ్డిపాలెంకి చెందిన ఓటర్ల ఓట్లు ఇతరులు వేశారంటూ కాంగ్రెస్ నేతల నిరసన తెలిపి, రీపోలింగ్ నిర్వహించాలని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. పోలింగ్ కేంద్రం వద్దకు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రావడంతో ఆయన వాహనంపై రాళ్లతో TDP శ్రేణులు దాడి చేశారు. దీంతో ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులు గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు.