హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిసెంబర్ 8న జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శన

నెల్లూరులో డిసెంబర్ 8న జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శన నిర్వహించనున్నారు. డిసెంబర్ 3న పాఠశాల స్థాయిలో, 4న మండల స్థాయిలో ప్రదర్శనలు జరుగుతాయని జిల్లా సైన్స్ అధికారి కేవీఆర్ మూర్తి తెలిపారు. 8, 9, 10వ తరగతుల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. జిల్లా నుంచి ఏడు ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నారు.