ELR: ఉంగుటూరు మండలంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంటకు ముగిసింది. మండలంలోని 23 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 47,891 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు 23,806 మంది, స్త్రీలు 24,083 మంది ఓటు వేశారు. మొత్తం పోలింగ్ శాతం 82.76 శాతంగా నమోదైంది. పోలింగ్ ముగియగానే కేంద్రాల గేట్లు మూసివేసి పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
82.76 శాతం పోలింగ్ నమోదు: ఎంపీడీవో


