హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్సీ సమక్షంలో బీజేపీలో చేరికలు

E.G: రాజమండ్రి ప్రముఖ వైద్యులు, బీజేపీ సీనియర్ నాయకులు డా. కవికొండల శ్రీనివాస్ కుమారులు, కోడలు డా. లలిత ఆదివారం బీజేపీలో చేరారు. శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలో నూతనంగా చేరిన వైద్య దంపతులకు సోము వీర్రాజు స్వాగతం పలికారు. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.