హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి

AKP: యలమంచిలిలో సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు. మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే, చైర్‌పర్సన్, టీడీపీ నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం సభా ప్రాంగణం, హెలిప్యాడ్ ప్రాంతాలను సందర్శించి, ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.