హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బలపంలో సర్పంచ్ అభ్యర్థి విజయభేరి ర్యాలీ

ASR: చింతపల్లి మండలం బలపం పంచాయతీలో ఆదివారం జనసేన సర్పంచ్ అభ్యర్థి కొర్ర సంధ్య విజయభేరి ర్యాలీ నిర్వహించారు. పంచాయతీలోని 70 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేస్తానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కె. రంగారావు, జి. సింహాద్రి, పి. లింగరావు, ఎంపీటీసీ అభ్యర్థి రాజబాబు, మండల అధ్యక్షుడు వి. బుజ్జిబాబు పాల్గొన్నారు.