హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మధురవాడ ఆలయంలో చోరీ

VSP: మధురవాడ 9వ వార్డు వాంబే కాలనీలోని గణపతి, బాల దుర్గమ్మ, మొగదారమ్మ ఆలయంలో దొంగతనం జరిగింది. ఆదివారం ఆలయ తలుపులు తెరిచిన పూజారులు నాగేంద్ర, భవాని హుండీలు పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న పీఎం పాలెం క్రైమ్ ఎస్‌ఐ సూర్యప్రకాష్ ఆదేశాలతో క్లూస్ టీమ్, క్రైమ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.