హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఐజీపీ తనిఖీలు

AKP: ఎలమంచిలి రూరల్ పరిధిలోని జంపపాలెం, షేకిల్లపాలెం గ్రామాల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను విశాఖ రేంజ్ ఐజీపీ గోపీనాథ్ జట్టి ఆదివారం తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో సమీక్షించి పోలీసు సిబ్బందికి కీలక సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన అనంతరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని, పటిష్ట బందోబస్తు కొనసాగించాలని ఆదేశించారు.