హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ పరిశీలించిన కలెక్టర్

కర్నూలు జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. పోలింగ్ సజావుగా కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. ఓట్ల లెక్కింపును ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.