హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రగ్స్ రహిత సమాజం కోసం సైకిల్ ర్యాలీ

ASR: పాడేరులో ఆదివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మై భారత్, ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నషాముక్త భారత్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రిన్సిపల్ సత్యనారాయణ ర్యాలీని ప్రారంభించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కళాశాల నుంచి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేశారు.